Wednesday, June 25, 2008

one of chalam's best story.....ఆ రాత్రి

this is one of the best stories of chalam,which i will never forget...
his narration style(style,this is one word chalam really hates if one appreciates chalam story on the basis of style).
i have never thought about this kind of narration and this story-point,never before in my life before reading this story. ....there may be some people who behave like the story's main character(commentator).nowadays we are finding these kind of people,thanks due to the unavailability of story-points for media(local, national and all media are alike in peeping into people's personal lives these days,in addition to the technology monitoring like secret cameras, monitoring,bugging,RFIDs,TRP tracking through SET-TOP boxes,Digital receivers etc ).

ok. coming into this story... i will try to load the story in parts.. this is a real big story almost 46 pages in print... i can scan the pages and upload them..but, i really like it to type and post it in the blog.
here goes the story by the Great Telugu Story Writer chalam Sir...


రాత్రి
"On such a night as this-"(ఆన్ సచ్ నైట్ యాజ్ దిస్) అని ఆగాడు రాజయ్య ఉమ్మేసుకోడానికని కిటికీ తెరిచి వెన్నెల వంక చూస్తో .
ప్రేమ ఎంతో అవసరమనీ, అదో బూర్జువా జబ్బనీ ,డబ్బూ,ఘనతా, కుటుంబాభ్యుదయమే ఆదర్శమనీ,ఎంత ఎందరు మొత్తుకొన్నా వినక, కార్తీక మాసపు రాత్రి వెన్నెల -రాళ్ళని చలవరాళ్లగా,మురుగుకాలవల్ని తేటనీటి సేలయేళ్ళుగా,చీకటిగొందుల్ని ఆకాశ మార్గాలుగా ,చివరికి అభ్యుదయాసక్తమైన ఇరుకు హృదయాల్ని కూడా కలలోకి చిగిర్చేటట్లు చేస్తోంది. ఇదేమీ గమనించ తలచుకోని ఇద్దరు self made successful (సెల్ఫ్ మేడ్ సక్సేసఫుల్ ) కుటుంబీకులు చలిగాలికి దడిసి తలుపులు వేసి కుర్చీలో పడుకున్నారు.ఒకాయన చుట్ట కాలుస్తున్నాడు.ఇంకో ఆయన కబుర్లకి ఉద్యుక్తుదౌతున్నాడు.జీవితాన్నిస్వంత శ్రమ వల్ల విజయవంతం చేసుకొన్నంత భరించరాని మనుషుల్ని చూడడం కష్టం,బైటికి చాల polished(పాలిష్డ్) పెద్దమనుషులే,కానీ వాళ్ల దుర్మార్గం భార్యలమీదా, పిల్లలమీదా, వారిమీద ఆధారపడే వారిమీదా, యాచించ వచ్చిన మనుషులమీదా కనపడుతుంది.ఆజ్ఞలు పెట్టరు,దడిపించరు ,వ్యక్తి స్వేఛ్ఛా అనీ మాట్లాడుతారు.వారికి విషయమైనా సరే తీర్చి, కొలిచి ,అంచులు చెక్కిన అభిప్రాయాలు.దేవుడు ,సంఘ సంస్కారం ,యోగులు, ధనోపయోగం,మర్యాద-వీటిల్లో వారినుంచి భేదాభిప్రాయాలకి వారి సంసారాల్లో చోటివ్వరు. మిత్రులలో చాలా మార్జిన్ వదిలి తప్పుకొంటారు. కానీ తమ వారు అనేవారిలో సహించరు. వారితో వాదించరు. తాము స్పష్టంగా నమ్ముతారు.తాము నమ్మేదే సరైన సంగతి అని , అభిప్రాయాలతో వాతావరణాన్ని నింపుతారు. కందిపచ్చడిలో వెల్లుల్లిపాయ వేయవచ్చునా కూడదా అనే ప్రశ్న కూడా రాదు.వెయ్యకూడదు అని తోస్తే, అంతే . రెండో రుచికి ఇంటో చోటు వుండదు. వెయ్యవద్దని అనరు కానీ వెయ్యడానికి యెవరికీ గుండెలు వుండవు. పిల్లలు విధంగా వర్తించాలో భార్యకి ఆదేశిస్తారు."నాన్న గారికి ఇష్టం లేదు" అంటే చాలు దేముడికి ఇష్టం లేదన్నమాటే. బీద విద్యార్డులూ, ముష్టివాళ్ళు,పండితులూ యాచనకి వస్తే ,లెక్చర్లిచ్చి ,అట్లా యాచించడం ఎంత నీచమో ,తాము యాచించకుండా అంత ఘనతకి ఎట్లా రాగలిగారో తమ స్వీయచరిత్రని చెప్పి పంపిస్తారు. జీవితం ఒడిదొడుకూ లేకుండా సాగాలి.కలవారి మనసు చాలా సుకుమారం. పిల్ల గాని,ఎవరుగాని ఏదన్నా కలవరం కలిగించారా, మాటలాడని ఆగ్రహంతో పిల్లని గిజగిజ లాడిస్తారు. ఆయన తన గదిలో కోపంగా కూచున్నాడా ఇల్లంతా ఉష్ణజ్వాలలు సమస్తప్రాణుల్నీ వుడికించేస్తాయి.దీంటో ప్రపంచోద్ధరణగాళ్ళు వుంటారు.వాళ్లు దానిని గురించి వ్యాసాలేగాని, అసలు కానీ వదలరు. సంఘస్వరూపమే,ఆర్దికవిధానమే మారాలి అని బోధిస్తో వుంటారు. పైపై స్నేహానికి సరదాగా వుంటారు గాని, లోపల కుష్ఠు రోగుల శరీరం నయం, వాళ్ల ఆత్మల కంటే. వాళ్ల మామూలు నమ్మకాలకీ ,మనోశాంతికీ భంగం కలిగించే మహిమలు గాని,వింతలుగాని వున్నాయని ,తమకన్నా వుదారమైన,వున్నతమైన శక్తులున్నాయని వింటే వాళ్లు విషంగా నవ్వుతారు.బుద్దిహీనుల నమ్మకాలంటారు.వాటి సంగతి తమకేమీ తెలీక పోయినా , అవి జిత్తులని వాటి వెనుక వుండే రహస్యాల్ని వూహించి విశదం చేస్తారు . కవిత్వం,ప్రణయం, యోగం,త్యాగం,ఇవి కనపడ్డాయా-మండిపడతారు.ఏవో ఆదర్శాలు పెట్టుకొని జీవితాల్ని ధ్వంసం చేసుకొనేవాళ్ళమీద చాలా అసహ్యం, త్రుణీకారం.
చేష్టలో గాని మాటలోగాని ఎప్పుడూ తమని మరచో ఒక ఉద్రేకం లోకిగాని ఉత్సాహం లోకిగాని పోరు.జాగ్రత్తగా సరిచూసుకొంటో ,తోవ తడుముకొంటూ,లేక్కలువేసుకొంటో,బలువుగా,లావుగా ,పందికొక్కుల మల్లే జీవితం లో కన్నాలు చేసుకొంటో పొతోవుంటారు,దొలిచిన మట్టినంతా యెవరికీ కనపడకుండా వెనక్కి తోసుకొంటో. జాగ్రత్తగా రుచిగా తమ రూల్సు ప్రకారం వంట చేయించుకుని పొట్టనిండా తినడమూ, పని చూసుకోడమూ, రాత్రి లెక్క ప్రకారం సంసారం చెయ్యడమూ- ఇంతే దినచర్య. వాళ్ల సుకుమార హృదయాలకి అయిష్టమైన మాటకానీ,పేరుకాని, వుద్దేశం కానీ ,వినపడకూడదు. వీరి వుద్దేశ్యాలను శిరసావహించి , ఇంకోవిధంగా గాలి పీల్చుకోడానికి కూడా భయపడే భార్యా,పిల్లా, తల్లీ ,అత్తగారూ, తమ్ముడూ,కోడలూ వుద్దేశ్యాలే, అభిరుచులే చాలా గొప్పవనీ, సరైనవని నమ్మి,వాటిని చూసుకొని గర్వపడతారు. వాళ్ళట్లా గర్వపడేటట్టు చేస్తారు సమర్ధులు. ఏదైనా విరుద్ధాభిప్రాయం ఇతరులెవరిద్వారా నన్నా ఇంటో ప్రవేశించిందా వెంటనే సునాయాసంగా దాన్ని హత్య చేస్తారు. విషంగా నవ్విగాని,కనుబొమలు ముడిచిగాని,"ఇంక చాలు. సారి మాట వినబడనీకండి" అనిగానీ.


No comments: