living everyday like a last one
Monday, February 3, 2014
Friday, July 1, 2011
Sunday, June 29, 2008
is it really co-incidence or copying?
His last movie, “Oru Cheru Punchiri”, was made in 2000. MT gave me the gist of the story. It is about the life of an old couple, who live all by themselves. They have frequent quarrels, but are like two parts of one whole. Only a small boy comes to take tuition from the man. In one scene, the old man climbs up the attic and finds a lot of junk. The wife, when asked why they shouldn’t be thrown out, says they are meant to burn his corpse, since that is the only purpose they can serve. Then she removes the ladder, leaving the man fuming, sweating and swearing in the attic. The old woman whispers to the boy that the fellow is fond of gorging himself with sweets. Later, she goes on to feed her husband his choicest foods. Finally the man dies. The old woman continues to live there and refuses to leave what was her “home” for decades. She feels her man’s presence in that house, even after his death.
This film got rave reviews in several places, including the London and Munich film festivals. It was the first film for the female lead. “I missed the London event, but attended the Munich festival. The hall was packed. At the end of the screening, the organisers gave just 15 minutes for interaction. There were many questions — some very intelligent and insightful. But then, when I told them that the characters were based on real life, one old lady got up and asked, ‘Do they still have sex?’ I gathered my wits in a few seconds and replied, ‘That’s something I have to ask them’. You can’t think of anyone in India posing such a question,” he remarks with a chuckle.
it really reminded me about the story Sri-Ramana has written in Rachana or some other magazine around 1990's(95-99).i just donot know whether this one is based on Ramana's story or not.so i searched for this on web and found the info....Yahoooo....its based on the story by Sri-Ramana...
i got the info about the movie like this:
Oru Cheru Punchiri
Starring: Oduvil Unnikrishnan, P.K. Venukuttan Nair, Aliyar, Jayakrishnan, Thampi Kannanthanam, Paul, Mukundan, Joy and Nirmala Sreenivasan.
Based on a story by: Sriramana
Art Direction: Radhakrishnan Mangalath
Costumes: Indrans Jayan
Audiography: Krishnanunni
Editing: Beena Paul
Cinematography: Sunny Joseph
Music: Johnson
Co-Producer: Asianet Communications Ltd.
Produced by: Jisha John
Written and Directed by: M.T. Vasudevan Nair
I really enjoyed the story in its andhra(not telangana,andhra division, i know only one andhra,that is the andhrapradesh where people speak Telugu)backdrop,with the small village, house,the old couple and their sarasaalu(flirtations)...i donot know how they made it in the movie...that too in Malayalam by MT...
But, i never know how the movie is as i donot know how i can get this movie...
at least i am glad that someone like MT sir made a movie based on this story...
Thursday, June 26, 2008
ఆ రాత్రి ---2
దూరంనించి అపాయం వొస్తున్నట్లు తోచిందా,చల్లగా తప్పుకుని పక్కవారిమీదనించి అపాయాన్ని దొర్లి పోనిస్తారు.
ఇంకెవరూ లేకపోతే భార్యమీదనైనా సరే -ప్రియురాలు అసలు వుండనే వుండదు, ప్రేమ అంటే హేళన గనక. ప్రేమని యెరుగనే ఎరుగవు ఆ హృదయాలు.ఏ వుద్రేకం వల్లనన్నామనిషి కదిలి పట్టాలు తొలిగాడా,దాన్ని ఓ రోగమంటారు.
ఆ రాత్రి ఆ గదిలో కుర్చీలలో పడుకున్న పెద్దమనుష్యులిద్దరూ typical self-made men, కానీ వాళ్ళిద్దరి జీవితాల్లోనూ స్త్రీ మీద మమత ప్రభావం బలంగా పనిచెయ్యడం వల్ల టైపునించి విభేదించారు చెరోవిధంగాను.ఎటువంటి స్త్రీ అయినా సరే ,ప్రేమించిందంటే , ఆ పురుషుడి స్వభావంలో ,అతను మొత్తం మీద ఎంత నీచుడూ ,క్రూరుడైనా,ఒక భాగానికి ఓ ఔన్నత్యం పట్టి వుంటుంది. ఆ ప్రేమే పట్టుగా కొంతకాలం వాళ్ల జీవితాల్ని పరిపాలిస్తే క్రమంగా పెద్దమృదువైన మార్పు కలుగుతుంది.ఎటువంటి కర్కశ స్వభావంలో కూడా కొంత విశాలత్త్వం ఏర్పడుతుంది.
ఆ గదిలో ఆ రాత్రి పదకొండు గంటలప్పుడు కుర్చీలలో హాయిగా పడుకున్న మిత్రులు ఇద్దరూ వయసు మల్లినవాళ్ళే.
చిన్నప్పుడు స్కూలులో కాలేజీలో కలిసి చదువుకున్నారు .ఆఇంటి యజమాని రిటైరైన లెక్చరరు శ్యామారావు.ఆయన అతిధి మిత్రుడు ,చాలా డబ్బు సంపాయించిన వకీలు రాజయ్య.కాలేజీలో విడిపడి, ముప్ఫై ఏళ్ళ చిల్లర తరువాత ఇదే కలుసుకోవడం వాళ్లు.రాజయ్య రెండో కూతురుకి సంబంధం చూడ్డానికి ఆ వూరు వొచ్చి తన మిత్రుడి ఇంటో దిగాడు.రెండో రోజు రాత్రి అది.
చుట్ట కాలుస్తూ ఉమ్మేసుకోడానికని లేచి రాజయ్య " On such a night as this- జ్ఞాపకముందా?" అంటో వొచ్చి కుర్చీలో పడుకున్నాడు, పై కప్పువేపు పొగ వదులుతో కొంచెం సేపు మాటాడలేదు ఎవరూ. నిశ్శబ్దం నాలుగు నిముషాలే .కానీ ఏళ్ళ జ్ఞాపకాలు!
పక్కన రైలుకట్ట .దానిమీద వంతెన కిందనించి దొల్లుకొంటూ వచ్చే పంట కాలవ.వెన్నెట్లో ఆ నీళ్ళన్నీపాలైనాయి. కాలవకట్టన పొగడచెట్టు.దానికింద ముగ్గురు మిత్రులూ సహధ్యాయులూ అట్లాంటి కార్తీకపు వెన్నెల రాత్రి -మధ్య విశాలాక్షి .చెరొక పక్కన వీరిద్దరూ హుషారైన యువకులు-ఎన్నేళ్ళ కిందటో .ఆ రాత్రి ముగ్గురూ తోడి రాగం లో పాడారు.షేక్సుపియరు ఇంగ్లీషు పాటని -On such a night as this - అని తప్పులతో ముగ్గురూ కంఠాలు కలిపి.కాని రెండు కంఠాలు కలవడం సులభం గాని మూడు కలవ్వు.
అసలు మొదట శ్యామారావుకి విశాలాక్షి కీ స్నేహం.చదువుకొనే స్త్రీలని స్వాతంత్రురాళ్ళైన వారినీ చూస్తీ అతనికి fancy( ఫాంసీ) అందుకని ఆమెకి తన నోట్సు ఇవ్వడమూ,ఆమెకి చదువు విషయమై సలహాలు ఇవ్వడమూ అతనికి సరదా.శని ఆది వారాలు ఆమె ఇంటికి వెళ్లి ఆమెని 'కోచ్ ' చేసే వాడు కూడా .అతని ఆప్త మిత్రుడు రాజయ్యకి ఇట్లాంటి స్నేహాలు యేమాత్రం గిట్టవు.కనుక మిత్రుణ్ణి warn(వార్న్) చేసి వారించాలని చూశాడు.కాని శ్యామారావు వినలేదు. త్వరలో విశాలాక్షి శ్యామారావుల పేర్లు గోడలమీది కెక్కాయి. వాళ్ళ పెద్దవాళ్ళకి ఆకాశరామన్న వుత్తరాలు వెళ్ళాయి. దాంతో వాళ్ళిద్దరికీ చాలా సిగ్గేసింది.తమ స్నేహాన్ని ఇట్లా అసహ్యంగా ప్రచురిస్తారని వాళ్లెప్పుడూ అనుకోలేదు.విశాలాక్షి కాలేజీ కి రాలేదు వరుసగా నాలుగు రోజులు.శ్యామారావు కి దిగులు పట్టుకుంది, తనమూలంగా విశాలాక్షి చదువు మానిపించారేమోనని .అంతే కాదు, ఆమెని చూడకుండా వుండలేనని అప్పుడే తెలియవచ్చింది.ఆమెని ఆమె తలిదండ్రులు ఏం బాధ పెడుతున్నారో! ఓ సాయంత్రం శ్యామారావు వాళ్ల ఇంటివేపుకి వెడితే,విశాలాక్షి తండ్రి అతడ్ని ఇంక ఆ ఇంటివేపు రావొద్దని కఠినంగా చెప్పాడు.శ్యామారావు డెస్పరేట్ ఐ తన మిత్రుణ్ణి విశాలాక్షి ఎలావుందో చూసి రమ్మని బతిమాలుకున్నాడు. చివరికి మత్రుడి అవస్తని భరించలేక వెళ్లడానికి వొప్పుకొన్నాడు,శ్యామారావు ఓ వుత్తరం కూడా ఇచ్చాడు.రాజ్య రాత్రికానిచ్చి వెళ్లి విశాలాక్షిని పిలిచాడు. వాళ్ల ఇంట్లో కొంచెం మాటాడి వుత్తరం ఇస్తో వుండగా విశాలాక్షి తండ్రి చూసి ఎవరో సరిగా గమనించకుండానే వుత్తరం లాక్కొని ,"నిన్ను ఇటు రావొద్దని చెప్పలేదురా? నా పిల్లని బతకనియ్యవా? " అంటో మెడపట్టుకుని గెంతాడు రాజయ్యని.అర్భకుడైన రాజ్య హఠాత్తయిన ఆ తోపులో గుమ్మంలో కింద పడ్డాడు.రాత్రి పదింటికి శ్యామారావు గదికి వచ్చి రాజయ్య తనకి జరిగినదంతా చెప్పాడు. ఆనాటినుంచి వారిద్దరి స్నేహమూ మరింత బలపడ్డది కాలేజీలో.
i am a bit busy now
chalam really killing me.....
haha ha... but onething which i really wonder is: how chalam sir lived all the life fighting with the society and really living his life in the way he loved to live......i envy him much...
i have takjen photo of hi from his storybook... i will upload sometime soon...
anyhow goodmorning and goodnight...
will comeback with the second part of ఆ రాత్రి ..... soon
Wednesday, June 25, 2008
one of chalam's best story.....ఆ రాత్రి
his narration style(style,this is one word chalam really hates if one appreciates chalam story on the basis of style).
i have never thought about this kind of narration and this story-point,never before in my life before reading this story. ....there may be some people who behave like the story's main character(commentator).nowadays we are finding these kind of people,thanks due to the unavailability of story-points for media(local, national and all media are alike in peeping into people's personal lives these days,in addition to the technology monitoring like secret cameras, monitoring,bugging,RFIDs,TRP tracking through SET-TOP boxes,Digital receivers etc ).
ok. coming into this story... i will try to load the story in parts.. this is a real big story almost 46 pages in print... i can scan the pages and upload them..but, i really like it to type and post it in the blog.
here goes the story by the Great Telugu Story Writer chalam Sir...
ప్రేమ ఎంతో అవసరమనీ, అదో బూర్జువా జబ్బనీ ,డబ్బూ,ఘనతా, కుటుంబాభ్యుదయమే ఆదర్శమనీ,ఎంత ఎందరు మొత్తుకొన్నా వినక,ఆ కార్తీక మాసపు రాత్రి వెన్నెల -రాళ్ళని చలవరాళ్లగా,మురుగుకాలవల్ని తేటనీటి సేలయేళ్ళుగా,చీకటిగొందుల్ని ఆకాశ మార్గాలుగా ,చివరికి అభ్యుదయాసక్తమైన ఇరుకు హృదయాల్ని కూడా కలలోకి చిగిర్చేటట్లు చేస్తోంది. ఇదేమీ గమనించ తలచుకోని ఇద్దరు self made successful (సెల్ఫ్ మేడ్ సక్సేసఫుల్ ) కుటుంబీకులు చలిగాలికి దడిసి తలుపులు వేసి కుర్చీలో పడుకున్నారు.ఒకాయన చుట్ట కాలుస్తున్నాడు.ఇంకో ఆయన కబుర్లకి ఉద్యుక్తుదౌతున్నాడు.జీవితాన్నిస్వంత శ్రమ వల్ల విజయవంతం చేసుకొన్నంత భరించరాని మనుషుల్ని చూడడం కష్టం,బైటికి చాల polished(పాలిష్డ్) పెద్దమనుషులే,కానీ వాళ్ల దుర్మార్గం భార్యలమీదా, పిల్లలమీదా, వారిమీద ఆధారపడే వారిమీదా, యాచించ వచ్చిన మనుషులమీదా కనపడుతుంది.ఆజ్ఞలు పెట్టరు,దడిపించరు ,వ్యక్తి స్వేఛ్ఛా అనీ మాట్లాడుతారు.వారికి ఏ విషయమైనా సరే తీర్చి, కొలిచి ,అంచులు చెక్కిన అభిప్రాయాలు.దేవుడు ,సంఘ సంస్కారం ,యోగులు, ధనోపయోగం,మర్యాద-వీటిల్లో వారినుంచి భేదాభిప్రాయాలకి వారి సంసారాల్లో చోటివ్వరు. మిత్రులలో చాలా మార్జిన్ వదిలి తప్పుకొంటారు. కానీ తమ వారు అనేవారిలో సహించరు. వారితో వాదించరు. తాము స్పష్టంగా నమ్ముతారు.తాము నమ్మేదే సరైన సంగతి అని , ఆ అభిప్రాయాలతో వాతావరణాన్ని నింపుతారు. కందిపచ్చడిలో వెల్లుల్లిపాయ వేయవచ్చునా కూడదా అనే ప్రశ్న కూడా రాదు.వెయ్యకూడదు అని తోస్తే, అంతే . రెండో రుచికి ఆ ఇంటో చోటు వుండదు. వెయ్యవద్దని అనరు కానీ వెయ్యడానికి యెవరికీ గుండెలు వుండవు. పిల్లలు ఏ విధంగా వర్తించాలో భార్యకి ఆదేశిస్తారు."నాన్న గారికి ఇష్టం లేదు" అంటే చాలు దేముడికి ఇష్టం లేదన్నమాటే. బీద విద్యార్డులూ, ముష్టివాళ్ళు,పండితులూ యాచనకి వస్తే ,లెక్చర్లిచ్చి ,అట్లా యాచించడం ఎంత నీచమో ,తాము యాచించకుండా అంత ఘనతకి ఎట్లా రాగలిగారో తమ స్వీయచరిత్రని చెప్పి పంపిస్తారు. జీవితం ఏ ఒడిదొడుకూ లేకుండా సాగాలి.కలవారి మనసు చాలా సుకుమారం.ఏ పిల్ల గాని,ఎవరుగాని ఏదన్నా కలవరం కలిగించారా, మాటలాడని ఆగ్రహంతో ఆ పిల్లని గిజగిజ లాడిస్తారు. ఆయన తన గదిలో కోపంగా కూచున్నాడా ఇల్లంతా ఉష్ణజ్వాలలు సమస్తప్రాణుల్నీ వుడికించేస్తాయి.దీంటో ప్రపంచోద్ధరణగాళ్ళు వుంటారు.వాళ్లు దానిని గురించి వ్యాసాలేగాని, అసలు కానీ వదలరు. సంఘస్వరూపమే,ఆర్దికవిధానమే మారాలి అని బోధిస్తో వుంటారు. పైపై స్నేహానికి సరదాగా వుంటారు గాని, లోపల కుష్ఠు రోగుల శరీరం నయం, వాళ్ల ఆత్మల కంటే. వాళ్ల మామూలు నమ్మకాలకీ ,మనోశాంతికీ భంగం కలిగించే మహిమలు గాని,వింతలుగాని వున్నాయని ,తమకన్నా వుదారమైన,వున్నతమైన శక్తులున్నాయని వింటే వాళ్లు విషంగా నవ్వుతారు.బుద్దిహీనుల నమ్మకాలంటారు.వాటి సంగతి తమకేమీ తెలీక పోయినా , అవి జిత్తులని వాటి వెనుక వుండే రహస్యాల్ని వూహించి విశదం చేస్తారు . కవిత్వం,ప్రణయం, యోగం,త్యాగం,ఇవి కనపడ్డాయా-మండిపడతారు.ఏవో ఆదర్శాలు పెట్టుకొని జీవితాల్ని ధ్వంసం చేసుకొనేవాళ్ళమీద చాలా అసహ్యం, త్రుణీకారం.
చేష్టలో గాని మాటలోగాని ఎప్పుడూ తమని మరచో ఒక ఉద్రేకం లోకిగాని ఉత్సాహం లోకిగాని పోరు.జాగ్రత్తగా సరిచూసుకొంటో ,తోవ తడుముకొంటూ,లేక్కలువేసుకొంటో,బలువుగా,లావుగా ,పందికొక్కుల మల్లే జీవితం లో కన్నాలు చేసుకొంటో పొతోవుంటారు,దొలిచిన మట్టినంతా యెవరికీ కనపడకుండా వెనక్కి తోసుకొంటో. జాగ్రత్తగా రుచిగా తమ రూల్సు ప్రకారం వంట చేయించుకుని పొట్టనిండా తినడమూ, పని చూసుకోడమూ, రాత్రి లెక్క ప్రకారం సంసారం చెయ్యడమూ- ఇంతే దినచర్య. వాళ్ల సుకుమార హృదయాలకి అయిష్టమైన మాటకానీ,పేరుకాని, వుద్దేశం కానీ ,వినపడకూడదు. వీరి వుద్దేశ్యాలను శిరసావహించి , ఇంకోవిధంగా గాలి పీల్చుకోడానికి కూడా భయపడే భార్యా,పిల్లా, తల్లీ ,అత్తగారూ, తమ్ముడూ,కోడలూ ఆ వుద్దేశ్యాలే, అభిరుచులే చాలా గొప్పవనీ, సరైనవని నమ్మి,వాటిని చూసుకొని గర్వపడతారు. వాళ్ళట్లా గర్వపడేటట్టు చేస్తారు ఈ సమర్ధులు. ఏదైనా విరుద్ధాభిప్రాయం ఇతరులెవరిద్వారా నన్నా ఇంటో ప్రవేశించిందా వెంటనే సునాయాసంగా దాన్ని హత్య చేస్తారు. విషంగా నవ్విగాని,కనుబొమలు ముడిచిగాని,"ఇంక చాలు.ఈ సారి ఆ మాట వినబడనీకండి" అనిగానీ.